Ireland Racist Attack: ఐర్లాండ్ లో ఆరేళ్ల భారత సంతతి చిన్నారిపై జాతి వివక్ష దాడి

Indian Girl Racially Abused and Attacked in Ireland
  • అసభ్యంగా దూషిస్తూ దాడి చేసిన పిల్లలు
  • ఇంటి ముందు ఆడుకుంటుండగా ఘటన
  • తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన తల్లి 
  • కేసు వద్దని, పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి
ఐర్లాండ్ లోని భారత సంతతికి చెందిన ఆరేళ్ల చిన్నారిపై జాతి వివక్ష దాడి జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై స్థానిక పిల్లలు దాడి చేశారు. సౌత్ ఈస్ట్ ఐర్లాండ్ లోని వాటర్ ఫోర్డ్ సిటీలో చోటుచేసుకుందీ ఘటన. అసభ్యంగా దూషిస్తూ, ఇండియాకు వెళ్లిపొమ్మని బెదిరించారని బాధితురాలి తల్లి మీడియాకు వెల్లడించారు. తన బిడ్డపై చేయిచేసుకోవడంతో పాటు ప్రైవేట్ పార్టులపై దాడి చేశారని తెలిపారు.

స్థానికంగా ఉంటున్న పది నుంచి పద్నాలుగేళ్ల వయసున్న బాలురు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గడిచిన ఎనిమిదేళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, ఇటీవలే పౌరసత్వం కూడా వచ్చిందని ఆమె తెలిపారు. కేరళలోని కొట్టాయం నుంచి చట్టబద్ధంగా వలస వచ్చి, స్థానిక చట్టాలను గౌరవిస్తూ జీవిస్తున్నామని పేర్కొన్నారు. తాను నర్సుగా స్థానిక ఆసుపత్రిలో సేవలందిస్తున్నానని, తనలాంటి వారి అవసరం ఐర్లాండ్ కు ఉందని ఆమె తెలిపారు.

ఈ దాడితో తన కూతురు విపరీతంగా ఆందోళన చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను కూడా ఐరిష్ పౌరురాలినేనని, నర్సుగా దేశ ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. తన పిల్లలు ఇక్కడ సురక్షితంగా ఉంటారని భావిస్తే, తమ సొంత ఇంటి ముందు కూడా పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.

తన కూతురుపై దాడి చేసిన పిల్లలలో ఎనిమిదేళ్ల పాప కూడా ఉందని, మొత్తం ఐదుగురు దాడి చేశారని బాధితురాలి తల్లి ఆరోపించారు. అయితే, అధికారులు వారిని శిక్షించడం కాకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Ireland Racist Attack
Indian Girl Ireland
Racism Against Indian
Waterford City Ireland
Indian Diaspora Ireland
Hate Crime Ireland
Kerala Kottayam
Irish Citizenship
Racist bullying

More Telugu News