Hyderabad Police: స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం.. ముఠా గుట్టు రట్టు
- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో ఘటన
- స్పా సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు
- ఒక కస్టమర్ అరెస్ట్.. ఇద్దరు మహిళలను రక్షించిన పోలీసులు
- పెద్ద మొత్తంలో జీతాలు, కమీషన్ల ఆశ చూపి మహిళలకు వల
హైదరాబాద్‌లో స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార దందా గుట్టు రట్టయింది. మేడిపల్లిలోని ద్వారకా నగర్‌లో ఉన్న ఒక స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేసి, ఈ రాకెట్‌ను భగ్నం చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడితో పాటు ఒక కస్టమర్‌ను అరెస్టు చేశారు. వ్యభిచార కూపంలో చిక్కుకున్న ఇద్దరు మహిళలను రక్షించారు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ స్పా సెంటర్‌పై దాడి జరిగింది. విచారణలో ప్రధాన నిందితురాలు స్వప్న, ఆమె సహచరులు నవీన్, అశోక్ కుమార్‌తో కలిసి ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్టు తేలింది. వీరు మసాజ్ సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు.
ఈ ముఠా సభ్యులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను ఆకర్షించి, ఎక్కువ జీతాలు, కమీషన్ల ఆశ చూపి వ్యభిచారంలోకి దింపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.