సినీ న‌టి మీరా మిథున్ అరెస్టు

  • ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో న‌టి మీరా మిథున్ అరెస్టు
  • మూడేళ్లుగా ప‌రారీలో ఉన్న ఆమెను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు 
  • ఈ నెల 11న కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్న పోలీసులు
  • ఇదే కేసులో 2021 ఆగ‌స్టులో మీరా మిథున్‌, ఆమె స్నేహితుడు శ్యామ్‌ అభిషేక్‌ అరెస్టు
  • అనంత‌రం బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోవ‌డంతో 2022లో అరెస్ట్ వారెంట్ జారీ
ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో త‌మిళ సినీ న‌టి మీరా మిథున్ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా ప‌రారీలో ఉన్న ఆమెను ప్ర‌స్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11న కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో 2021 ఆగ‌స్టులో మీరా మిథున్‌, ఆమె స్నేహితుడు శ్యామ్‌ అభిషేక్‌ను అరెస్టు చేశారు. అనంత‌రం బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోవ‌డంతో 2022లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది.  

ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో ఉన్న మీరా మిథున్‌ను ర‌క్షించి తమకు అప్ప‌గించాల‌ని కోరుతూ ఆమె త‌ల్లి దాఖ‌లు చేసిన పిటిష‌న్ సోమ‌వారం కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. అప్పుడు చెన్నై లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీ ద్వారా ఢిల్లీలో ఉన్న లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీకి సంబంధిత సమాచారం ఇచ్చి, ఢిల్లీ పోలీసుల సాయంతో ఆమెను గుర్తించి అక్క‌డున్న ప్ర‌భుత్వ హోంలో ఉంచిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. 


More Telugu News