అలాంటివాళ్లే ఉన్నదంతా పోగొట్టుకున్నారు: నటి రోజారమణి

  • అప్పట్లో ఇల్లే ఒక ప్రపంచమన్న రోజా రమణి 
  • అమాయకత్వం కారణంగా మోసపోయేవారని వెల్లడి 
  • గుడ్డిగా నమ్మడమే అందుకు కారణమని వ్యాఖ్య 
  • ఇప్పడు ఆ పరిస్థితి లేదని వివరణ 

బాలనటిగా 'భక్త ప్రహ్లాద' సినిమాతో పరిచయమైన రోజారమణి, ఆ తరువాత కాలంలో అనేక సినిమాలలో నటించారు. ఎన్నో సినిమాలలో హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. నటిగాను .. డబ్బింగ్ కళాకారిణిగాను ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి రోజారమణి, తాజాగా 'సుమన్ టీవీ'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"చిన్నతనంలోనే ఇండస్ట్రీకి రావడం వలన, చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేశాను. అప్పట్లో సంపాదించిందంతా పోగొట్టుకున్నవారు ఎక్కువగానే ఉండేవారు. సరైన గైడెన్స్ లేకపోవడం వలన, అవగాహన లేకపోవడం వలన మోసపోయినవారు ఎక్కువగా కనిపిస్తారు. వర్క్ పరంగా బిజీగా ఉండి, డబ్బుకు సంబంధించిన విషయాలు అయినవాళ్లకు అప్పగించి మోసపోయినవారు కూడా చాలామందే ఉన్నారు" అని అన్నారు. 

"ఎవరు తమని మోసం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని పసిగట్టగలిగే తెలివితేటలు అప్పట్లో తక్కువనే చెప్పాలి. అప్పట్లో ప్రపంచమంటే ఇల్లు .. అమ్మానాన్న అన్నట్టుగా ఉండేది. అలా పెరగడం వలన, మంచితనం .. అమాయకత్వం కారణంగా చాలామంది మోసాన్ని గ్రహించలేకపోయారు.  ఇక తెలివి తేటలు ఉండి కోట్లు కూడబెట్టినవారు కూడా లేకపోలేదు. ఈ జనరేషన్ లో మోసపోయేవారు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే చదువుకుంటున్నారు .. ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటూ పెరుగుతున్నారు" అని చెప్పారు.



More Telugu News