తిరుమల ఈస్ట్ బాలాజీ నగర్ లో చిరుత సంచారం.. వీడియో ఇదిగో!

––
తిరుమలలో మరోమారు చిరుత సంచారం కలకలం రేపింది. ఈస్ట్ బాలాజీ నగర్ సమీపంలోని బాల గంగమ్మ ఆలయంలోనికి సోమవారం రాత్రిపూట చిరుత ప్రవేశించింది. ఆలయ ఆవరణలోని విగ్రహాల వద్దకు చేరుకున్న చిరుత.. అక్కడున్న ఓ పిల్లిపై దాడికి ప్రయత్నించింది.

ఆలయంలోని సీసీటీవీ కెమెరాలలో చిరుత కదలికలను గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం ఆలయం వద్దకు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. చిరుత కదలికల నేపథ్యంలో భక్తులను, సమీపంలో నివాసం ఉంటున్న వారిని అప్రమత్తం చేశారు. భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.


More Telugu News