Gold Price: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర

Gold Price Soars Bad News for Gold Lovers
  • శ్రావణమాసంలో బంగారం ధరలకు రెక్కలు
  • రూ. 820 పెరిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం
  • రూ. 2 వేలు పెరిగిన కేజీ వెండి ధర
శ్రావణమాసంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న కొంత తగ్గిన బంగారం ధర... ఈరోజు అమాంతం పెరిగిపోయింది. వెండి ధర కూడా షాకిస్తోంది.

ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 820 పెరిగి రూ. 1,02,220 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరిగి రూ. 93,700 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,700 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇదే సమయంలో వెండి ధర కూడా పెరుగుతోంది. గత వారం నిలకడగా ఉన్న వెండి ధర... ఈరోజు భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2 వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ. 1,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్ కతాలో కూడా ఇదే రేట్ ఉంది. చెన్నైలో మాత్రం మరో రూ. 10 వేల ఎక్కువ ధర ఉంది. 
Gold Price
Gold rate today
Silver price
Gold price increase
Sravana Masam
Wedding season gold demand
24 Carat gold price
22 Carat gold price
Silver rate increase
Gold market

More Telugu News