బీఆర్ఎస్ కు షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా
- రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించిన బాలరాజు
- ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడి
- ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన బాలరాజు
తన రాజీనామా లేఖలో బాలరాజు పలు విషయాలను ప్రస్తావించారు. రాజీనామా నిర్ణయం అంత ఈజీగా తీసుకున్నది కాదని చెప్పారు. ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుని, ఎంతో ఆలోచించిన తర్వాత బాధతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రెండు దశాబ్దాలుగా పని చేయడం గర్వంగా ఉందని చెప్పారు. కష్ట సమయంలో పార్టీని వీడటం బాధగా ఉందన్నారు.