Roja: రోజాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన గాలి భాను ప్రకాశ్

Gali Bhanu Prakash Makes Strong Comments Against Roja Again
  • రోజా, ఆమె కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారన్న భాను
  • బియ్యం, ఇసుక అక్రమ రవాణా చేశారని ఆరోపణ
  • గంజాయి దందాలో కూడా వారి పాత్ర ఉందన్న భాను
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజా, ఆమె కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బియ్యం, ఇసుక అక్రమ రవాణా చేశారని విమర్శించారు. గంజాయి దందాలో కూడా వారికి భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. గంజాయి దందాలో వారి పాత్ర ఉన్నట్టు తేలితే, మెడ పట్టుకుని లాక్కెళ్లి లోపల వేస్తామని హెచ్చరించారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడబోమని అన్నారు. 

గత కొంత కాలంగా గాలి భాను ప్రకాశ్, రోజా మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. రోజాను ఉద్దేశించి ఇటీవల భాను మాట్లాడుతూ... రూ. 2 వేలు ఇస్తే రోజా ఏ పనైనా చేసేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యాంప్ కు ఎక్కువ, హీరోయిన్ కు తక్కువ అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రోజా జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ లకు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే సంస్కృతిని టీడీపీ ప్రోత్సహిస్తోందని ఆమె మండిపడ్డారు.
Roja
Gali Bhanu Prakash
Andhra Pradesh Politics
Nagari
TDP
YSRCP
Corruption Allegations
Ganja Smuggling
Political Controversy
Andhra Pradesh

More Telugu News