Nagar Kurnool: నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని బోటులో వెళ్లి కాపాడిన స్థానికులు.. వీడియో ఇదిగో!

Nagar Kurnool Man Rescued from Drowning in Krishna River



నదిలో ఈతకు దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు స్పందించి రక్షించారు. బోటులో వెళ్లి ఒడ్డుకు తీసుకొచ్చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళ గంగ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాంతం కావడంతో హైదరాబాద్‌ కు చెందిన నలుగురు మిత్రులు విహారయాత్రకు వచ్చారు. పాతళ గంగ వద్ద కృష్ణానదిలో దిగి సరదాగా ఈదులాడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నది లోపలికి వెళ్లడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఇది చూసి మిగిలిన ముగ్గురు మిత్రులు కాపాడాలని కేకలు పెట్టగా సందర్శకులను బోటుపై తిప్పే స్థానికులు స్పందించారు. బోటుతో వెళ్లి నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు.

Nagar Kurnool
Amrabad
Pathala Ganga
Krishna River
River Rescue
Telangana Tourism
Viral Video
Boat Rescue
Drowning Accident
Hyderabad

More Telugu News