Rajinikanth: రజనీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది

Rajinikanth Coolie Trailer Released
  • సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కూలీ
  • ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందం
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కూలీ' ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచారంలో భాగంగా నిన్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే పాటలు మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ లోకేష్ తనదైన శైలిలో కూలీ ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడన్న అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.

ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రజనీకి విలన్ గా నాగార్జున నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ 'కూలీ' చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. సత్యరాజ్, సౌబిన్ షాహిర్, మహేంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 
Rajinikanth
Coolie movie
Lokesh Kanagaraj
Nagarjuna
Sun Pictures
Kollywood
Telugu cinema
Anirudh Ravichander
Kalanidhi Maran

More Telugu News