Donald Trump: భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?

Donald Trump calls India a dead economy AI responds
  • భారత్ ఆర్థికను డెడ్ ఎకానమీగా అభివర్ణించిన ట్రంప్
  • భారత ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదన్న చాట్‌జీపీటీ
  • భారత్ డెడ్ ఎకానమీ కాదన్న గ్రోక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను 'డెడ్ ఎకానమీ'గా అభివర్ణించడంపై దేశంలోని అధికార, విపక్ష నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

ప్రస్తుత సాంకేతిక యుగంలో కృత్రిమ మేధ (ఏఐ) అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. తాజాగా, ట్రంప్ పేర్కొన్నట్లు భారత్ ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అని ఏఐని ప్రశ్నించగా, అది ఇచ్చిన సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

"భారత్ ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదు. అది డైనమిక్. ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది" అని చాట్‌జీపీటీ పేర్కొంది.

"లేదు. భారత్‌ది డెడ్ ఎకానమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇది ఒకటి" అని గ్రోక్ తెలిపింది. "భారత ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతోంది" అని జెమిని సమాధానమిచ్చింది.
Donald Trump
Indian economy
US President
dead economy
India economic growth
Artificial Intelligence
ChatGPT
Grok
Gemini
economic development

More Telugu News