Sri Bharat: టీసీఎస్ వస్తే విశాఖకు మరెన్నో కంపెనీలు వస్తాయనే లాజిక్ వైసీపీ నేతలు మరిచారు: ఎంపీ శ్రీ భరత్

MP Sri Bharat Criticizes YSRCP on TCS Issue in Visakhapatnam
  • విశాఖ అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగాలు వస్తాయన్న ఎంపీ
  • విశాఖ అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదని విమర్శ
  • తక్కువ ధరకు ఇచ్చారనడం కంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో చూడాలని హితవు
విశాఖపట్నంకు టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజం వస్తే మరెన్నో కంపెనీలు వస్తాయన్న లాజిక్‌ను విస్మరించి వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ నగరం అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగాలు రావడం ప్రతిపక్షానికి ఇష్టం లేదని విమర్శించారు. టీసీఎస్ ఎక్కడికో వెళుతుంటే తాము భూములిచ్చి విశాఖలో నెలకొల్పేలా చేశామని వెల్లడించారు.

టీసీఎస్‌కు తక్కువ ధరకు భూములిచ్చారనే దానికంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేది చూడాలని హితవు పలికారు. వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోకుంటే ఈసారి డిపాజిట్లు కూడా రావని హెచ్చరించారు. అలాగే, ప్రతి ఒక్కరు టీసీఎస్ వలే పెద్ద క్యాంపస్ కట్టలేని కంపెనీలు ఉంటాయని, అలాంటి వారి కోసం 'సత్వా' డెవలపర్స్ ప్రాజెక్టు చేపడుతుందని ఆయన అన్నారు.

ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు 25 ఎకరాల్లో పదిహేను, ఇరవై టవర్లు కడితే చిన్న చిన్న కంపెనీలు వస్తాయని అన్నారు. హైదరాబాద్‌లో రహేజా మైండ్ స్పేస్‌లో ఎన్నో కంపెనీలు వచ్చాయని, రేపు సత్వాలోనూ అలాగే వస్తాయని తెలిపారు.
Sri Bharat
Visakhapatnam
TCS
IT Companies
Andhra Pradesh
Satya Developers

More Telugu News