Nara Lokesh: కొడుకు పీటీఎంకు హాజరైన మంత్రి లోకేశ్

Nara Lokesh Attends Son Devaansh PTM
  • కుమారుడు దేవాంశ్ చ‌దువుతున్న స్కూల్‌కు వెళ్లిన మంత్రి లోకేశ్‌
  • పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన పేరెంట్-టీచ‌ర్ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి
  • అర్ధాంగి బ్రాహ్మ‌ణితో క‌లిసి వెళ్లిన ఫొటోను ఎక్స్ వేదిక‌గా పంచుకున్న లోకేశ్‌
  • ఇలాంటి క్ష‌ణాలు చాలా ప్ర‌త్యేక‌మ‌ని వ్యాఖ్య
ఏపీ విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ త‌న కుమారుడు నారా దేవాంశ్ చ‌దువుతున్న స్కూల్‌కు వెళ్లారు. పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన పేరెంట్-టీచ‌ర్ మీటింగ్ (పీటీఎం) హాజ‌ర‌య్యారు. అర్ధాంగి బ్రాహ్మ‌ణితో క‌లిసి వెళ్లిన ఫొటోను ఆయ‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా షేర్ చేశారు. 

తన అధికారిక విధులకు విరామం ఇచ్చి మరీ తన కుమారుడి పాఠశాలకు వెళ్లి సమావేశంలో పాల్గొన్నారు. ఒక తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించడంతో పాటు, విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో చాటిచెప్పడానికే తాను ఈ సమావేశానికి హాజరైనట్లు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

"ప్ర‌జా జీవితంలో తీరిక లేకుండా ఉన్న స‌మ‌యంలో.. ఇలాంటి క్ష‌ణాలు చాలా ప్ర‌త్యేకం. దేవాంశ్ నువ్వు చెప్పే ముచ్చ‌ట్లు తండ్రిగా సంతోషాన్నిస్తాయి. నిన్ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా" అని లోకేశ్ ట్వీట్ చేశారు. 
Nara Lokesh
Nara Devaansh
AP Minister
Parent Teacher Meeting
PTM
Brahmani Nara
Education
Andhra Pradesh
School Meeting
Family

More Telugu News