Sameera Fatima: తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నించి పట్టుబడిన ఘరానా లేడీ!

Sameera Fatima arrested for 8 marriages scam in Maharashtra
  • మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఘటన
  • డబ్బున్న యువకులను లక్ష్యంగా చేసుకుని వివరాలు సేకరిస్తున్న కిలాడీ
  • డబ్బు సంపాదన కోసం తప్పుడు మార్గం ఎంచుకున్న సమీరా ఫాతిమా!
విడాకులు అయ్యాయని నమ్మించి ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుని, తొమ్మిదో పెళ్లికి సిద్ధమవుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ యువతి... పెళ్లి కాని, ధనవంతులైన యువకులను లక్ష్యంగా చేసుకుని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ల ద్వారా వారి వివరాలను సేకరిస్తుంది.

అనంతరం, సామాజిక మాధ్యమాలలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి, తనకు విడాకులు అయ్యాయని, ఒక బిడ్డ ఉందని చెబుతూ వారిని భావోద్వేగపరంగా దగ్గర చేసుకుని వివాహం చేసుకుంటుంది. ఈ క్రమంలో తొమ్మిదో పెళ్లికి ప్రయత్నించగా పోలీసులకు చిక్కింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సమీరా ఫాతిమా అనే మహిళ ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. వయస్సు మీద పడుతున్నా పెళ్లి కాని ధనవంతులను లక్ష్యంగా చేసుకొని, సామాజిక మాధ్యమాల ద్వారా వారికి దగ్గరవుతుంది. తాను విధిలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నానని నమ్మిస్తూ, ఒక బిడ్డతో ఒంటరిగా జీవిస్తున్నట్లు చెబుతుంది.

వారిని నమ్మించి వలలో వేసుకున్న తర్వాత వారి నుండి డబ్బులు డిమాండ్ చేస్తుంది. అవసరమైతే బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రత్యేకంగా ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుంది. గత పదిహేనేళ్లలో 8 పెళ్లిళ్లు చేసుకుని భారీ మొత్తంలో డబ్బు గుంజినట్లు పోలీసులు గుర్తించారు. ఒక వ్యక్తి నుంచి ఏకంగా రూ. 50 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తొమ్మిదో పెళ్లికి సిద్ధమైంది. జులై 29న నాగపూర్‌లోని ఒక టీ దుకాణం వద్ద ఆ వ్యక్తిని కలిసేందుకు వచ్చిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విస్మయం కలిగించే విషయం ఏంటంటే.. ఈ కిలాడీ బాధితుల్లో రిజర్వ్ బ్యాంక్ సీనియర్ అధికారులు కూడా ఉన్నారట. 
Sameera Fatima
Sameera Fatima marriage scam
Maharashtra crime
Matrimony fraud
Online dating scam

More Telugu News