GST: జులై నెల జీఎస్టీ వసూళ్లు...డేటా ఇదిగో!

July GST Collections Data Released
  • జులై మాసం జీఎస్టీ డేటా విడుదల చేసిన కేంద్రం 
  • 7.5 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరిక
  • ఇటీవలి నెలలతో పోలిస్తే కాస్త తగ్గిన వృద్ధి
దేశంలో జులై నెల వసూళ్ల డేటాను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. గత ఏడాది జులైతో పోలిస్తే, ఈ జులై మాసంలో జీఎస్టీ వసూళ్లు 7.5 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ లావాదేవీలు, దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం ఈ పెరుగుదలకు కారణం. అయితే, ఇటీవలి నెలలతో పోలిస్తే వృద్ధి కాస్త తక్కువగా ఉంది. 

2025 ఏప్రిల్-జులై మధ్య జీఎస్టీ వసూళ్లు రూ. 8.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది రూ. 7.39 లక్షల కోట్లతో పోలిస్తే 10.7 శాతం పెరిగాయి. జులైలో సెంట్రల్ జీఎస్టీ రూ. 35,470 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 44,059 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 1,03,536 కోట్లు, సెస్ రూ. 12,670 కోట్లు వసూలయ్యాయి.

జులైలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.8 లక్షల కోట్లకు పైగా ఉన్నప్పటికీ, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సగటు రూ. 2.1 లక్షల కోట్లతో పోలిస్తే తక్కువ. ఏప్రిల్‌లో రూ. 2.37 లక్షల కోట్లు, మేలో రూ. 2.01 లక్షల కోట్లు వసూలయ్యాయి. రీఫండ్‌ల తర్వాత జులై నికర జీఎస్టీ ఆదాయం రూ. 1,68,588 కోట్లుగా ఉంది, గత ఏడాదితో పోలిస్తే 1.7 శాతం మాత్రమే పెరిగింది. రీఫండ్‌లు రూ. 27,147 కోట్లకు పెరగడం దీనికి కారణం. 

ఏప్రిల్-జులైలో నికర జీఎస్టీ ఆదాయం 8.4 శాతం పెరిగి రూ. 7.11 లక్షల కోట్లకు చేరింది.రాష్ట్రాల వారీగా త్రిపురా 41 శాతం, మేఘాలయ 26 శాతం వృద్ధి సాధించాయి. మధ్యప్రదేశ్ 18 శాతం, బీహార్ 16 శాతం, ఆంధ్రప్రదేశ్ 14 శాతం పెరిగాయి. మహారాష్ట్ర రూ. 30,590 కోట్లతో 6 శాతం వృద్ధి నమోదు చేసింది. కర్ణాటక 7 శాతం, తమిళనాడు 8 శాతం, గుజరాత్ 3 శాతం పెరిగాయి. మణిపూర్‌లో 36 శాతం, మిజోరంలో 21 శాతం వసూళ్లు తగ్గాయి.జులైలో తయారీ రంగం 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరి ఆర్థిక గతిని బలపరిచింది.
GST
GST collections
July GST
Indian economy
Tax revenue
Central GST
State GST
Integrated GST
Goods and Services Tax
Tax collection data

More Telugu News