: కానిస్టేబుల్ పై చేయిచేసుకున్న ఏపీ మంత్రి సోదరుడు.. వీడియో ఇదిగో!
- నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని ఆలయంలో ఘటన
- అనుచరులతో కలిసి ఆలయానికి వచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు
- కానిస్టేబుల్ పై దాడి చేసిన బీసీ మదన్ భూపాల్ రెడ్డి అరెస్టు
ఆలయ సందర్శనకు వెళ్లిన మంత్రి సోదరుడు అక్కడి భద్రతా సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించాడు. తనను అడ్డుకున్నాడనే ఆగ్రహంతో ఓ కానిస్టేబుల్ పై చేయిచేసుకున్నాడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని ఆలయంలో చోటుచేసుకుందీ ఘటన. ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ మదన్ భూపాల్ రెడ్డి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా, కానిస్టేబుల్ పై దాడి చేసిన మదన్ భూపాల్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మరోపక్క, తన సోదరుడు చేసిన పనిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బహిరంగంగా ఖండించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యుల అహంకారానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అని మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..
కొలిమిగుండ్లలోని ఆలయానికి శుక్రవారం బీసీ మదన్ భూపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో లోపలికి వెళుతున్న ఆయనను అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అని, అటువైపు వెళ్లడానికి వీలులేదని చెప్పాడు. దీంతో మదన్ భూపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సదరు కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మదన్ భూపాల్ ఆగ్రహం పట్టలేక కానిస్టేబుల్ ను నెట్టివేశారు. ఆపై కానిస్టేబుల్ చెంపపై కొట్టారు. ఈ సంఘటనతో ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు కలగజేసుకుని కానిస్టేబుల్ పై దాడి చేసిన మదన్ భూపాల్ ను అరెస్టు చేశారు.