నేను ఏ తప్పు చేయలేదు.. త్వరలో అన్ని విషయాలు బయటపెడతా: 'సృష్టి' నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత
- ఒక ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో కేసు నమోదైందన్న నమ్రత
- కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న పోలీసులు
- 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన కోర్టు
గాంధీ ఆసుపత్రి వద్ద ఆమె మాట్లాడుతూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఒక ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆమె అన్నారు.
సృష్టి సరోగసి అక్రమాల కేసులో డాక్టర్ నమ్రత ఏ1గా ఉన్నారు. సరోగసి పేరుతో ఆమె పలువురు దంపతులను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల సాయంతో అసోంకు చెందిన మహిళల నుంచి పిల్లలను కొనుగోలు చేసి తీసుకువచ్చి, ఆయా దంపతులకు వారి బిడ్డలుగా అప్పగించే వారని ఆరోపణలు వున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వీర్యం, అండాలు సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయించారు.