AP Police: ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫ‌లితాల విడుద‌ల‌

AP Police Constable Final Results Released
  • ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ హ‌రీశ్ కుమార్ గుప్తా
  • ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఫ‌లితాలు
  • ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 6,100 కానిస్టేబుల్ పోస్టుల‌ భ‌ర్తీ  
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ హ‌రీశ్ కుమార్ గుప్తా ఈ రోజు ఉదయం మంగ‌ళ‌గిరిలోని డీజీపీ కార్యాల‌యంలో ఫ‌లితాల‌ను విడుదల చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక‌ వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/లో ఫ‌లితాల‌ను అందుబాటులో ఉంచిన‌ట్టు తెలిపారు. 

ఇక‌, ఈ ఫ‌లితాల్లో గండి నానాజి 168 మార్కుల‌తో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. అలాగే జి.ర‌మ్య మాధురి 159 మార్కుల‌తో రెండో స్థానం, మెరుగు అచ్యుతారావు 144.5 మార్కుల‌తో మూడో స్థానంలో నిలిచారు. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 6,100 కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.    


AP Police
AP Police Constable
Constable Results
Andhra Pradesh Police
Harish Kumar Gupta
Anita AP Home Minister
SLPRB AP
Gandi Nanaji
Police Recruitment

More Telugu News