Srushti Fertility Center: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ రిమాండ్ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు

Srushti Fertility Center Scam Shocking Details in Remand Report
  • ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రత
  • సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి మోసం చేసినట్లు అంగీకారం
  • రాజస్థాన్ దంపతులను కడా మోసం చేసిన నమ్రత
సికింద్రాబాద్‌లోని సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. సరోగసీ చేయకున్నా చేసినట్లుగా నమ్మించి పలువురు దంపతులను మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

రాజస్థాన్ దంపతులను కూడా సరోగసీ విషయంలో నమ్రత మోసం చేసినట్లు తేలింది. డీఎన్ఏ పరీక్షలు చేయాలని వారు కోరగా, విషయం బయటపడుతుందని ఆమె తప్పించుకున్నారు. కొంత సమయం ఇస్తే తప్పును సరిదిద్దుకుంటామని నమ్రత చెప్పారు. అయితే, ఆ దంపతులు అంగీకరించకపోవడంతో ఆమె తన కుమారుడితో వారిని బెదిరించారు.

సృష్టి సెంటర్ సరోగసీ పేరుతో అనేక మోసాలకు పాల్పడిందని, ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు వసూలు చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. ఈ మోసాలకు ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు ఏఎన్ఎంల సహాయం కూడా తీసుకున్నట్లు వారు అంగీకరించారు.
Srushti Fertility Center
Fertility center scam
Dr Namrata
Surrogacy fraud
Secunderabad
IVF

More Telugu News