Jennifer Larson: జెన్నిఫర్ లార్సన్‌కు మంత్రి శ్రీధర్ బాబు ఆత్మీయ వీడ్కోలు

Sridhar Babu bids farewell to Jennifer Larson
  • హైదరాబాద్ అమెరికా కాన్సుల్ జనరల్‌గా పదవీకాలం పూర్తి చేసుకున్న జెన్నిఫర్
  • తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను బహూకరించిన మంత్రి
  • బలోపేతం చేసేందుకు జెన్నిఫర్ విశేష కృషి చేశారన్న మంత్రి
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ తన పదవీకాలాన్ని ముగించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆమెకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహూకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ, అమెరికా మధ్య సత్సబంధాలను బలోపేతం చేసేందుకు జెన్నిఫర్ విశేష కృషి చేశారని కొనియాడారు. విద్య, సాంస్కృతిక మార్పిడి, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఈ సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా ఆమె సహకారం అందించాలని కోరారు. జెన్నిఫర్ తన తదుపరి ప్రయాణంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Jennifer Larson
Sridhar Babu
US Consul General Hyderabad
Telangana USA relations

More Telugu News