Nandika Krishna: నిద్రిస్తున్న భర్తపై సలసల మరిగే వేడినీళ్లు పోసిన భార్య!

Wife Pours Boiling Water on Sleeping Husband in Visakhapatnam
  • విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని నేరెళ్లవలసలో ఘటన
  • ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జంట 
  • భర్త వేధింపులు భరించలేకపోయిన భార్య గౌతమి
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని నేరెళ్లవలసలో జరిగిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో విసిగిపోయిన భార్య, నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

నేరెళ్లవలసకు చెందిన నందిక కృష్ణ, గౌతమిలు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది కాలానికే వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. భర్త కృష్ణ వేధింపులు భరించలేకపోయిన గౌతమి, బుధవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో నిద్రిస్తున్న కృష్ణపై సలసల కాగే నీళ్లు పోసింది.

ఈ ఘటనలో కృష్ణ ముఖం, ఛాతి భాగం తీవ్రంగా కాలిపోయాయి. అతని కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి కృష్ణను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి, అనంతరం కే.జి.హెచ్. ఆసుపత్రిలోని సర్జరీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం కృష్ణ అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Nandika Krishna
Visakhapatnam
ভীমিলি
Nerellavalasa
domestic violence
গরম জল
crime
Andhra Pradesh
KGH Hospital
Gowthami

More Telugu News