జగన్ పర్యటనలో తొక్కిసలాట.. కానిస్టేబుల్ మాలకొండయ్యకు గాయాలు

  • నేడు నెల్లూరు వచ్చిన జగన్
  • నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి పరామర్శ 
  • జగన్ రాకతో ఒక్కసారిగా తోసుకువచ్చిన కార్యకర్తలు
వైసీపీ అధినేత జగన్ ఇవాళ నెల్లూరు పర్యటనకు రావడం తెలిసిందే. ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లే క్రమంలో భారీ తోపులాట జరిగింది. ఈ ఘటనలో మాలకొండయ్య అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆయనకు చేయి విరిగినట్టు తెలిసిందే. దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఓ సీఐ కూడా కిందపడిపోయారు. 

జగన్... ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా మెయిన్ రోడ్డుపైకి చేరుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టినా, ప్రయోజనం లేకపోయింది. వైసీపీ కార్యకర్తలు అలాగే ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత్ ఇప్పటికే ఆరా తీశారు. శాంతిభద్రతలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 


More Telugu News