‘మనం కొట్టినం’.. 'కింగ్డమ్‌'పై ర‌ష్మిక పోస్ట్.. రిప్లై ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

  • విజ‌య్ దేవ‌ర‌కొండ, గౌత‌మ్ తిన్న‌నూరి కాంబోలో 'కింగ్డమ్' 
  • ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మూవీ
  • చాలా రోజుల త‌ర్వాత విజ‌య్‌కి ఈ సినిమా రూపంలో హిట్ వ‌చ్చిన‌ట్లు టాక్‌
  • 'కింగ్డమ్‌' స‌క్సెస్ పై ర‌ష్మిక సోష‌ల్ మీడియా పోస్టు
విజ‌య్ దేవ‌ర‌కొండ, గౌత‌మ్ తిన్న‌నూరి కాంబోలో వ‌చ్చిన కింగ్డమ్ ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఈ సినిమా రూపంలో హిట్ వ‌చ్చిన‌ట్లు టాక్ వ‌స్తోంది. 

ఇదిలాఉంటే.. తాజాగా కింగ్డమ్‌ స‌క్సెస్ పై నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు. ‘మ‌నం కొట్టినం’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. "ఇది నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘మ‌నం కొట్టినం’. కింగ్డ‌మ్ స‌క్సెస్ అయింది" అని ర‌ష్మిక త‌న పోస్టులో రాసుకొచ్చారు. అయితే, ఈ ట్వీట్‌కు విజ‌య్ రిప్లై ఇచ్చారు. ‘మ‌నం కొట్టినం’ అంటూ హార్ట్ సింబ‌ల్ పోస్ట్ చేశారు.


More Telugu News