APSRTC: ఏపీలో ఉచిత బస్సు టికెట్ చూశారా!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రాబోతోంది. పథకం అమలు కోసం సన్నాహాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) నమూనా టికెట్‌ను ముద్రించింది.
ఈ టికెట్‌పై డిపో పేరు, స్త్రీశక్తి పథకం, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, టికెట్ ధర, ప్రభుత్వ రాయితీ వంటివి ముద్రించారు. టికెట్ ధరను రాయితీతో తీసేసి చెల్లించాల్సిన ధరను జీరోగా చూపించారు. ఈ నమూనా టికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.