Chandrababu Naidu: చంద్రబాబు ఏపీకి బయల్దేరుతున్నారని తెలిసి హోటల్ కు భారీగా తరలి వచ్చిన తెలుగు ప్రజలు... ఫొటోలు ఇవిగో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నాలుగు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరారు. పర్యటన చివరి రోజున ఆయనకు సింగపూర్‌లోని తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు.

నాలుగు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ముఖ్యమంత్రి 26 సమావేశాలు, కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక చర్చలు, ఒప్పందాలు ఈ పర్యటనలో భాగంగా జరిగాయి.

ముఖ్యమంత్రి పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దేరుతున్నారని తెలిసిన వెంటనే, సింగపూర్‌లోని తెలుగు ప్రజలు ఆయన బస చేసిన హోటల్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీడ్కోలు పలికే సమయంలో "జై సీబీఎన్" అంటూ నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌లోని తెలుగు ప్రజల అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్‌లోని తెలుగు ప్రజలు చూపిన ఆత్మీయ స్వాగతం, ప్రేమాభిమానాలను తాను మరువలేనని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెంటనే విజయవాడకు బయల్దేరి, రాత్రి 11:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.
Chandrababu Naidu
AP CM Singapore tour
Singapore Telugu people
Andhra Pradesh development
Jai CBN
Singapore airport
Singapore
Telugu community

More Telugu News