మరోసారి స్టన్నింగ్ లుక్‌లో ధోనీ.. నెటిజన్లు ఫిదా!
- బాలీవుడ్ హీరోలను తలపించేలా ధోనీ న్యూలుక్
- ట్రెండ్‌కు తగ్గట్లు తన హెయిర్ స్టైల్ మార్చే ధోనీ
- తాజాగా మరో కొత్త హెయిర్ స్టైల్‌లో మెరిసిన తలా
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ హీరోలను తలపించేలా ఉన్న ధోనీ న్యూలుక్‌కు నెటిజన్లను, అభిమానులు ఫిదా అవుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్లు తన హెయిర్ స్టైల్ మార్చే ధోనీ.. తాజాగా మరో కొత్త హెయిర్ స్టైల్‌లో మెరిశాడు. షార్ట్ హెయిర్, స్టైలిష్ గడ్డంతో బ్లాక్ టీషర్ట్ ధరించి గాగుల్స్‌తో తళుక్కుమన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, జులపాల జుట్టుతో భారత జట్టులోకి వచ్చిన ధోనీ హెయిర్ స్టైల్‌కు అప్పట్లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. చాలా మంది అభిమానులు ధోనీలా జులపాలు పెంచుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ కూడా ధోనీ హెయిర్‌స్టైల్‌ను కొనియాడిన విషయం తెలిసిందే. 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత జులపాల జుట్టును తీసేసిన ధోనీ.. ట్రెండ్‌కు అనుగుణంగా తన హెయిర్ స్టైల్‌ను మార్చుతున్నాడు. ముఖ్యంగా యాడ్ షూట్స్ కోసం ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌లో కనిపిస్తున్నాడు.