తెరకెక్కుతున్న హనీమూన్ మర్డర్ కేసు
- ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ పేరు ఖరారు
- ఎస్ పీ నింబావత్ దర్శకత్వంలో షూటింగ్ కు ఏర్పాట్లు
- సమ్మతి తెలిపిన రాజా రఘువంశీ కుటుంబం
కేసు నేపథ్యం..
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి ఈ ఏడాది మే 11న సోనమ్ రఘువంశీతో వివాహం జరిగింది. కొత్త దంపతులు హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కనిపించకుండా పోయారు. పదకొండు రోజుల తర్వాత పోలీసులు రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో గుర్తించారు. అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 7న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో రోడ్డు పక్కన డాబా వద్ద సోనమ్ రఘువంశీ ప్రత్యక్షమైంది. గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేస్తే తప్పించుకుని వచ్చానని పోలీసులకు తెలిపింది. అయితే, విచారణలో సోనమ్ రఘువంశీ తన ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసిందని తేలింది. ఈ హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.