Nithya Menen: పెళ్లిపై నోరు జారిన నిత్యా మేన‌న్.. వైర‌ల్‌గా మారిన వీడియో!

Nithya Menen slips up about marriage video goes viral
  
నాలుగు పదుల వయసు వస్తున్నా కానీ ఇంకా పెళ్లికి ఆమడ దూరంలోనే ఉన్నారు హీరోయిన్ నిత్యా మేన‌న్. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ సేతుపతి హీరోగా రాబోతున్న 'సార్ మేడమ్‌' చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇక, ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగా నిత్యా మేనన్ త‌న పెళ్లి విష‌య‌మై రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ పొర‌పాటున‌ నోరు జారారు. 

పెళ్లిపై స్పందించాల‌ని రిపోర్ట‌ర్లు ఆమెను అడిగారు. దీనిపై నిత్యా మేన‌న్ స్పందిస్తూ ఈ సినిమా హీరో, ద‌ర్శ‌కుడు న‌న్ను చాలా ట్రై చేశార‌ని చెప్ప‌డంతో ఈవెంట్‌కు వచ్చిన‌వారంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఇంత‌లో విజ‌య్ సేతుప‌తి క‌ల‌గ‌జేసుకుని స‌రిగ్గా చెప్పండి అంటూ సూచించారు. దాంతో త‌న పొర‌పాటు తెలుసుకున్న ఆమె.. త‌ర్వాత న‌న్ను పెళ్లి చేసుకోమ‌ని క‌న్విన్స్ చేయ‌డానికి హీరో, డైరెక్ట‌ర్ చాలా ట్రై చేశార‌ని చెప్పారు. దీంతో పొర‌పాటున నిత్యా నోరు జారిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

Nithya Menen
Nithya Menen marriage
Sir Madam movie
Vijay Sethupathi
Telugu cinema
Viral video
Movie promotions
Actress interview

More Telugu News