Raj Kesi Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు .. నిందితుడి సమాచారంతో రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న సిట్

AP Liquor Scam 11 Crore Rupees Seized Based on Accused Information
  • శంషాబాద్ సమీపంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు సోదాలు
  • 12 బాక్సుల్లో ఉన్న రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు
  • హైదరాబాద్ నగరంలోని పది ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్న సిట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతూ ఈరోజు వేకువజామున భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు రాజ్ కెసిరెడ్డి సూచనల మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.

కేసులో ఏ40గా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో సిట్ అధికారులు తనిఖీలు చేసి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఏ1 రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు ఏ40 వరుణ్, ఏ12 చాణక్య ఈ రూ.11 కోట్లు దాచినట్లు సిట్ విచారణ సందర్భంలో అంగీకరించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. నిందితుల సమాచారంతో సిట్ అధికారులు హైదరాబాద్ నగరంలో పది ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. 
Raj Kesi Reddy
AP Liquor Scam
Andhra Pradesh Liquor Scam
Varun Purushotham
Chanakya
SIT Investigation
Cash Seizure
Kacharam Village
Sulochana Farm Guest House
Hyderabad Raids

More Telugu News