ఉద్యోగిని జ్యోతి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. ఇద్దరు యువకుల అరెస్ట్

  • కర్ణాటకలోని తుంగభద్ర నదిలో దూకి జ్యోతి ఆత్మహత్య
  • నాలుగేళ్ల క్రితం వివాహం.. ఆపై భర్తతో కలహాల కారణంగా ఒంటరిగా ఉంటున్న యువతి
  • ఆరు నెలల క్రితం బసవరాజ్ అనే వ్యక్తితో సహజీవనం
  • కొంతకాలంగా అతడు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య
కర్ణాటకలోని తుంగభద్ర నదిలో జ్యోతి (25) అనే యువ ఉద్యోగిని ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటన వెనుక ఇద్దరు యువకుల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి జ్యోతి మృతదేహాన్ని నది నుంచి వెలికితీశారు.

విజయనగర ఎస్పీ ఎస్. జాహ్నవి వెల్లడించిన వివరాల ప్రకారం హడగలి తాలూకాలోని కె. అయ్యనహళ్లికి చెందిన జ్యోతి వ్యవసాయ శాఖలో పనిచేసేది. ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అయితే, భర్తతో కలహాల కారణంగా విడిగానే ఉంటోంది. ఆరు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన బసవరాజ్ అనే యువకుడితో జ్యోతికి పరిచయం ఏర్పడి, అది కాస్తా సహజీవనానికి దారితీసింది.

అయితే, ఇటీవల కాలంలో బసవరాజ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దీంతో జ్యోతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 27న తన పరిచయం, సహజీవనం, బసవరాజ్ ప్రవర్తనలోని మార్పు వంటి విషయాలను వివరిస్తూ ఒక ఉత్తరం రాసి డైరీలో ఉంచింది. ఆ తర్వాత తుంగభద్ర నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

జ్యోతి రాసిన ఉత్తరం ఆధారంగా హడగలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బసవరాజ్‌తో పాటు అతని స్నేహితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.


More Telugu News