టీటీడీకి విలువైన ఇంటిని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ దంపతులు
- విరాళంగా ఇచ్చిన మల్కాజ్‌గిరికి చెందిన కనకదుర్గ ప్రసాద్, సునీత దంపతులు
- భాస్కరరావు స్ఫూర్తితో విరాళంగా ఇచ్చిన దంపతులు
- టీటీడీ ఈవోకు పత్రాలు అందించిన కనకదుర్గ ప్రసాద్, సునీత దంపతులు
సంతానం లేని ఈ దంపతులు, తమ తదనంతరం 250 గజాల ఇల్లు శ్రీవారికి చెందేలా వీలునామా రాశారు.
ఇదిలా ఉండగా, మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కరరావు తన వీలునామా ద్వారా రూ. 3 కోట్ల విలువైన ఇల్లు, రూ. 66 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రస్ట్ ప్రతినిధులు సంబంధిత పత్రాలను టీటీడీ అధికారులకు అందజేశారు.