TCS: టీసీఎస్‌లో 12 వేల ఉద్యోగాల కోత ప్రకటన.. టెక్ కంపెనీతో టచ్‌లో కేంద్రం

TCS job cuts central government in touch with tech company
  • భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు టీసీఎస్ ప్రకటన
  • ఉపాధిలో వృద్ధి కేంద్ర ప్రభుత్వ కీలక అంశంగా ఉందన్న సంబంధిత వర్గాలు
  • ప్రస్తుత పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ గమనిస్తోందని వెల్లడి
టీసీఎస్ ఉద్యోగాల కోత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో టెక్ కంపెనీతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపాయి. టీసీఎస్‌లో భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు ఆ సంస్థ సీఈవో కె. కృతివాసన్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 12 వేలకు పైగా ఉద్యోగాలను తొలగించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ఉపాధి వృద్ధి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాల వంటి కార్యక్రమాలతో ఉద్యోగ అవకాశాలను ఎలా పెంచవచ్చనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నాయి. నైపుణ్య శిక్షణ, పునఃనైపుణ్య శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపాయి.

ప్రస్తుత పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఉద్యోగాల కోత అంశంపై టీసీఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను గుర్తించేందుకు లోతుగా అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది.
TCS
Tata Consultancy Services
IT layoffs
K Krithivasan
Indian IT sector
Tech industry jobs

More Telugu News