Hyderabad Cricket Association: హెచ్‌సీఏ అక్రమాల అంశం.. హైకోర్టులో సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్

Safilguda Cricket Club Petitions in High Court Over HCA Irregularities
  • హెచ్‌సీఏ బాధ్యతలను బీసీసీఐకి అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొన్న క్రికెట్ క్లబ్
  • ఆర్థిక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి
  • ఈ నెల 19న నిర్వహించిన వార్షిక సమావేశం చెల్లదని ప్రకటించాలని అభ్యర్థన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటు చేసుకున్న ఆర్థిక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో పలు అంశాలను సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ పేర్కొంది.

హెచ్‌సీఏ బాధ్యతలను బీసీసీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. ఆర్థిక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. అలాగే ఈ నెల 19న నిర్వహించిన వార్షిక సమావేశం చెల్లదని ప్రకటించాలని అభ్యర్థించింది.

హెచ్‌సీఏలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో విచారణ జరుగుతోంది. కీలక పదవుల్లో ఉన్న వారు అరెస్టు కావడంతో హెచ్‌సీఏ బాధ్యతలను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావుకు హైకోర్టు అప్పగించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు మూడు వారాల పాటు కొనసాగనున్నాయి.
Hyderabad Cricket Association
HCA
Safilguda Cricket Club
Telangana High Court

More Telugu News