Pahalgam Terrorists: పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్!

Pahalgam Terrorists Encounter Underway in Dachigam
  • జమ్మూలోని దాచిగామ్ లో ఎదురుకాల్పులు
  • ‘ఆపరేషన్ మహదేవ్’ చేపట్టిన బలగాలు.. 
  • పహల్గామ్ ఉగ్రవాదులు ముగ్గురు హతం
జమ్మూకశ్మీర్ లోని దాచిగామ్ లో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. పహల్గామ్ లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో దాచిగామ్ లో భద్రతా బలగాలు సోదాలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంతో ‘ఆపరేషన్ మహదేవ్’ చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో భద్రతా బలగాలతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు.

ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం. ఈ ముగ్గురు ఉగ్రవాదులూ పహల్గామ్ లో దాడికి పాల్పడిన వారేనని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై భద్రతా బలగాల నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఓవైపు పార్లమెంట్ లో ‘ఆపరేషన్ సిందూర్’ పై చర్చ జరుగుతుండగా జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరగడం, అదికూడా పహల్గామ్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంతో ఆపరేషన్ చేపట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Pahalgam Terrorists
Jammu Kashmir
Dachigam Encounter
Operation Mahadev
Terrorist Encounter
Indian Army
Jammu Kashmir Police
Terrorism India

More Telugu News