Viral Video: విమానం గాల్లో ఉండ‌గా.. బాంబు పెట్టబోతున్నానంటూ ప్ర‌యాణికుడి కలకలం.. వైర‌ల్‌ వీడియో!

Man Shouts Going To Bomb The Plane Mid Air Arrested In Scotland
  • ల్యూటన్‌ ఎయిర్‌ పోర్టు నుంచి గ్లాస్గో వెళుతున్న ఈజీజెట్ విమానంలో ఘ‌ట‌న‌
  • విమానంలో బాంబు పెట్టబోతున్నానంటూ 41 ఏళ్ల వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌ 
  • డెత్‌ టూ అమెరికా, డెత్‌ టూ ట్రంప్‌ అంటూ నినాదాలు చేసిన ప్ర‌యాణికుడు
  • ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్
విమానంలో బాంబు పెట్టబోతున్నానంటూ ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. ఈజీజెట్ విమాన‌యాన సంస్థ (Easyjet)కు చెందిన విమానం లండన్‌లోని ల్యూటన్‌ ఎయిర్‌ పోర్టు నుంచి స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో వెళుతోంది. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుల్లో నుంచి లేచిన 41 ఏళ్ల ఓ వ్యక్తి.. విమానంలో బాంబు పెట్టబోతున్నానని కేక‌లు వేయ‌డం ప్రారంభించాడు. డెత్‌ టూ అమెరికా, డెత్‌ టూ ట్రంప్‌ అంటూ నినాదాలు చేశాడు. అల్లా హో అక్బర్‌ అంటూ పెద్దగా అరిచాడు. 

అయితే, విమానంలోని మ‌రో ప్ర‌యాణికుడు అతన్ని నేలపై పడేసి అదమి పట్టుకున్నాడు. అనంతరం విమానం గమ్యస్థానానికి చేరిన తర్వాత గ్లాస్గో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వెనక ఎవరైనా ఉన్నారనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటర్‌ టెర్రరిజమ్‌ అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని స‌మాచారం. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్కాట్‌లాండ్‌ పర్యటనలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈయూతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో భాగంగా రెండు రోజుల క్రితమే స్కాట్‌లాండ్‌ వచ్చారు. 
Viral Video
Easyjet
Easyjet flight
Glasgow
London Luton Airport
Bomb threat
Scotland
Donald Trump
Death to America
Allahu Akbar

More Telugu News