MK Stalin: ఆరు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సీఎం స్టాలిన్

MK Stalin Discharged From Hospital After Six Days
  • ఇటీవల అస్వస్థతకు గురైన స్టాలిన్
  • వాకింగ్ చేస్తుండగా కళ్లు తిరిగిన వైనం
  • అపోలో ఆసుపత్రిలో చేరిక
  • యాంజియోగ్రామ్ నిర్వహించిన డాక్టర్లు 
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆదివారం సాయంత్రం చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరు రోజుల క్రితం ఆయనకు ఒక్కసారిగా కళ్ళు తిరగడంతో ఆసుపత్రిలో చేరారు. 72 ఏళ్ల స్టాలిన్ జూలై 21 ఉదయం వాకింగ్ చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో ఉన్న సమయంలోనూ ముఖ్యమంత్రి సీనియర్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, తన ఆసుపత్రి బెడ్ నుంచే ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించారు. 

వైద్య బృందం ప్రకారం, ప్రాథమిక పరీక్షలలో ఆయన గుండె కొట్టుకోవడంలో స్వల్ప హెచ్చుతగ్గులు గుర్తించారు. దీంతో ఆయన గుండె ఆరోగ్యాన్ని మరింత క్షుణ్ణంగా అంచనా వేయడానికి యాంజియోగ్రామ్ నిర్వహించారు. అపోలో ఆసుపత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో, వైద్యులు స్టాలిన్ చికిత్సకు బాగా స్పందించి పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు. "ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అపోలో హాస్పిటల్స్‌లోని నిపుణుల బృందం పర్యవేక్షణలో తన చికిత్సను పూర్తి చేసుకున్నారు. ఆయన ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నాం" అని ప్రకటనలో తెలిపారు.

కాగా, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సీఎం స్టాలిన్ కు సూచించారు. "వైద్య సలహా మేరకు, ముఖ్యమంత్రి సాధారణ పరిపాలనా బాధ్యతలను తిరిగి ప్రారంభించే ముందు మూడు రోజుల పాటు విరామం తీసుకుంటారు" అని ప్రకటనలో పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఆసుపత్రి నుంచి బయలుదేరారు.

MK Stalin
Stalin discharged
Tamil Nadu CM
Apollo Hospital Chennai
MK Stalin health
DMK leader
Stalin angiogram
Tamil Nadu politics
Stalin health update
Stalin hospital discharge

More Telugu News