బీఆర్ఎస్ విలీనం కోసం ప్రయత్నించారంటూ సీఎం రమేశ్ ఆరోపణ.. స్పందించిన కేటీఆర్
- తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందన్న కేటీఆర్
- విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
- ఇది పసలేని వాదన అంటూ వ్యాఖ్యాలు
రాజకీయ ఇరకాటంలో పడిన ప్రతిసారీ బీజేపీ, కాంగ్రెస్ లు ఈ విలీనం అంశాన్ని తీసుకువస్తుంటాయని విమర్శించారు. స్కాంల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇప్పుడు విలీనం అంశం తెరపైకి తెచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రమేశ్ ఇద్దరూ కలిసి వస్తే తాను చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.