రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు... చేతలు కావాలి: హరీశ్ రావు

  • నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజనింగ్
  • అస్వస్థతకు గురైన బాలికలు
  • బాలికలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత హరీశ్ రావు
నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బాలిక వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరగడంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. ఫుడ్ పాయిజన్ కు గురై చికిత్స పొందుతున్న బాలికలను హరీశ్ రావు నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు... చేతలు కావాలని స్పష్టం చేశారు. 

"గతంలోనూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగితే, మరోసారి ఇలాంటివి చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి అన్నారు... మరి ఉయ్యాలవాడ ఘటన ఎలా జరిగింది? సీఎం ఆదేశాలు అధికారులు పాటించడం లేదా? ఢిల్లీకి వెళ్లడానికి దొరికిన సమయం, విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు దొరకదా? ఫుడ్ పాయిజనింగ్ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలి... మానవ హక్కుల కమిషన్, హైకోర్టు వీటిని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి... రేవంత్ రెడ్డీ... మాపై కోపం ఉంటే మమ్మల్ని జైల్లో పెట్టండి... అంతేగానీ విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోకండి" అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. 


More Telugu News