బేబీ బంప్‌తో లావ‌ణ్య త్రిపాఠి.. ఇదిగో వీడియో!

  • వెకేష‌న్ నుంచి నిన్న తిరిగి హైద‌రాబాద్ చేరుకున్న వ‌రుణ్ తేజ్‌ దంప‌తులు
  • ఆ స‌మ‌యంలో బేబీ బంప్‌తో క‌నిపించిన లావ‌ణ్య 
  • లావ‌ణ్య బేబీ బంప్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్
మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి దంప‌తులు త్వ‌ర‌లో పేరెంట్స్ కాబోతున్న విష‌యం తెలిసిందే. తాజాగా లావ‌ణ్య బేబీ బంప్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆమె, వ‌రుణ్ వెకేష‌న్ నుంచి నిన్న తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా లావ‌ణ్య బేబీ బంప్‌తో క‌నిపించారు. కాగా, ఈ టాలీవుడ్ హీరో, హీరోయిన్ 2023లో వివాహ‌బంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. 

ఇక‌, వ‌రుణ్ తేజ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ  చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వ‌రుణ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా రితికా నాయక్ న‌టిస్తున్నారు. 

ఇండియన్ & కొరియన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఓ వినూత్న కథతో హారర్-కామెడీగా థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. త‌మన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ సిద్ధమవుతోంది. 


More Telugu News