Tanushree Dutta: నాకు ప్రాణ హాని ఉందంటూ నటి తనుశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు

Tanushree Dutta Says She Fears for Her Life
  • గత కొన్నేళ్లుగా అధాత్మిక జీవనశైలికి అలవాటుపడ్డానన్న తనుశ్రీ దత్తా
  • సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదిరిగానే తన ప్రాణం కూడా ప్రమాదంలో ఉందన్న తనుశ్రీ దత్తా
  • బాలీవుడ్ మాఫియా ముఠా చాలా పెద్దదని వ్యాఖ్య
భారతదేశంలో మీటూ ఉద్యమానికి నాంది పలికిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, గత ఆరేళ్లుగా తన సొంత ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానంటూ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

తనపై జరిగిన వేధింపుల గురించి వీడియో వైరల్ అయినప్పటి నుంచి ఇంటర్వ్యూల కోసం చాలా మంది ఫోన్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత కొన్నేళ్లుగా తాను ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటుపడ్డానని, అందుకే ఎక్కువగా మీడియా ముందుకు రావడం లేదని తెలిపింది.

తన ఆరోగ్యం బాగోలేకపోయినా కొన్ని రోజుల నుంచి వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే ఉన్నానని, తాను అందరితోనూ మాట్లాడతానని, కాకపోతే దానికి సమయం పడుతుందని పేర్కొంది. దయచేసి తనను ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

మరో మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ మాఫియా ముఠా చాలా పెద్దదని, తనకు ముంబయిలో ప్రాణానికి ముప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదిరిగానే తన ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని, అతని మాదిరిగానే తనను కూడా హత్య చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం తనుశ్రీ దత్తా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తనుశ్రీ దత్తా 2018లో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేసి దేశంలో ఈ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనను అనుచితంగా స్పృశించారని, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, డైరెక్టర్ రాకేష్ సారంగ్, ప్రొడ్యూసర్ సమీ సిద్దిఖీలు ఈ విషయంలో సహకరించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది.

అయితే, 2019లో ముంబయి పోలీసులు ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని తేల్చి, నానా పటేకర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. 2025 మార్చిలో ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తనుశ్రీ ప్రొటెస్ట్ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. ఆరోపణలు 2008 నాటివి కావడంతో చట్టపరమైన గడువు ముగిసిందని పేర్కొంది. 
Tanushree Dutta
Tanushree Dutta interview
Bollywood mafia
Me Too movement India
Nana Patekar
Sushant Singh Rajput death
Mumbai police
Bollywood harassment
Ganesh Acharya
Horn OK Please

More Telugu News