గోవాకు బయలుదేరిన మంత్రి లోకేశ్
- ఈరోజు గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం
- ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గోవాకు మంత్రి లోకేశ్
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్‌పీల మృతిపట్ల లోకేశ్ దిగ్భ్రాంతి
గోవా గవర్నర్‌గా ఈరోజు అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గోవా బయలుదేరి వెళ్లారు. కాగా, టీడీపీ సీనియర్ నేత అయిన అశోక్ గజపతి రాజు గవర్నర్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన చేసిన విషయం తెలిసిందే.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్‌పీల మృతిపట్ల లోకేశ్ దిగ్భ్రాంతి
తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇంటిలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.