Vijay Deverakonda: సినిమాల విషయంలో నా సోదరుడికి ఎలాంటి సలహాలు ఇవ్వను: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda No Film Advice for Brother Anand
  • భవిష్యత్తులో తన కొడుకు విషయంలోనూ ఇలాగే ఉంటానన్న నటుడు
  • ఫలానా సినిమా చేస్తున్నానని చెబితే వివరాలు అడగనన్న విజయ్ దేవరకొండ
  • పొరపాటు జరిగితే పాఠాలు నేర్చుకోవాలని కోరుకుంటానని వ్యాఖ్య
సినిమాల విషయంలో తన సోదరుడు ఆనంద్‌కు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వనని, ఆ స్థానంలో తన కుమారుడు ఉన్నా ఇలాగే వ్యవహరిస్తానని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. 'కింగ్‌డమ్' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఫలానా సినిమా చేస్తున్నానని తన సోదరుడు తనకు చెబుతాడని, తాను అక్కడి వరకే ఉంటానని చెప్పారు. కథ ఏమిటి? దర్శకుడు ఎవరు? వంటి విషయాలను అడగనని తెలిపారు.

తన సోదరుడు ఏదైనా పొరపాటు జరిగితే వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలని తాను కోరుకుంటానని అన్నారు. నటుడిగా ప్రయాణం ఎంత కష్టమో తనకు తెలుసునని విజయ్ దేవరకొండ అన్నారు. "ఇతర విషయాలు ఏవీ పట్టించుకోకుండా నీపై నీకు నమ్మకం ఉంటేనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టు" అని తాను ముందే చెప్పానని అన్నారు.

మొదట్లో కొంత కష్టమైనప్పటికీ క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడని అన్నారు. తనదైన శైలి కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడని తెలిపారు. భవిష్యత్తులో తన కుమారుడి విషయంలోనూ ఇలాగే ఉంటానని స్పష్టం చేశారు.
Vijay Deverakonda
Anand Deverakonda
Kingdom Movie
Telugu Cinema
Movie Promotions

More Telugu News