Air India: మరో ఎయిరిండియాలో సాంకేతిక లోపం.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే సమస్య

Air India flight returns after technical glitch
  • సాంకేతిక సమస్యను గుర్తించి వెనక్కి మళ్లించిన పైలట్లు
  • విమానం టేకాఫ్ అయిన చోటే ల్యాండింగ్
  • ఎయిరిండియా విమానాల్లో ఆందోళన కలిగిస్తున్న వరుస సాంకేతిక లోపాలు
జైపూర్ నుండి ముంబైకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన 18 నిమిషాలకే పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించారు. వెంటనే అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించారు. దీంతో విమానం సురక్షితంగా టేకాఫ్ అయిన ప్రదేశంలోనే ల్యాండ్ అయింది. ఈ సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ వరుస ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. మరో సంఘటనలో, హాంకాంగ్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఎయిరిండియా విమానం ఏ1 315 ల్యాండింగ్ అయిన వెంటనే పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి.
Air India
Air India technical issue
Jaipur Mumbai flight
flight emergency landing

More Telugu News