Shakthiswaran: యూట్యూబ్‌లో చూసి ఆహార నియమాలు పాటించి యువకుడు మృతి

Youth dies following YouTube diet in Tamil Nadu
  • తమిళనాడులోని కొలాచెల్ ప్రాంతంలో విషాదం
  • మూడు నెలలుగా యూట్యూబ్ ఛానళ్లను అనుసరిస్తూ కఠిన ఆహార నియమాలు
  • ఆహారం తీసుకోకుండా నీరు, పళ్ల రసాలు మాత్రమే తాగుతున్నాడని చెప్పిన కుటుంబ సభ్యులు
బరువు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్‌లో చూసి ఆహార నియమాలు పాటించిన పదిహేడేళ్ల యువకుడు శక్తిశ్వరన్ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని కొలాచెల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శక్తిశ్వరన్ గత మూడు నెలలుగా పలు యూట్యూబ్ ఛానళ్లను అనుసరిస్తూ కఠినమైన ఆహార నియమాలు పాటించినట్లు పోలీసులు గుర్తించారు. అతను ఆహారం తీసుకోకుండా కేవలం నీరు, పళ్ల రసాలు మాత్రమే తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు విచారణలో తెలిపారు.

శక్తిశ్వరన్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. కేవలం యూట్యూబ్ వీడియోల్లోని సూచనలనే అతను పాటించాడని వారు తెలిపారు. బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చేస్తున్నాడని, కొన్ని మాత్రలు వాడుతున్నాడని చెప్పారు.

గురువారం నాడు శక్తిశ్వరన్ ఒక్కసారిగా ఊపిరి ఆడక ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Shakthiswaran
Tamil Nadu
YouTube diet
weight loss
extreme dieting
teen death
Kolachel

More Telugu News