Revanth Reddy: తెలంగాణ క్యాబినెట్‌ భేటీ వాయిదా

Telangana Cabinet Meeting Postponed to Sunday



తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు సచివాలయంలో జరగాల్సిన క్యాబినెట్ భేటీని సోమవారానికి వాయిదా వేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ భేటీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.
Revanth Reddy
Telangana Cabinet Meeting
Telangana Politics
Bhatti Vikramarka
Uttam Kumar Reddy
AICC Meeting
Ponnam Prabhakar
Konda Surekha
Telangana Government
Telangana News

More Telugu News