MEPMA: ‘మెప్మా’ వాట్సాప్ గ్రూప్‌లో రిసోర్స్ పర్సన్ అశ్లీల చిత్రాలు

Guntur MEPMA Manager Transferred After Obscene Images Shared
   
గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న ఓ సిటీ మిషన్ మేనేజర్ (సీఎంఎం) వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది. గత సోమవారం రాత్రి మెప్మా సిబ్బంది వాట్సాప్ గ్రూప్‌లో ఒక రిసోర్స్ పర్సన్‌కు సంబంధించిన అశ్లీల చిత్రాలను పోస్ట్ చేయడం కలకలం రేపింది.

ఈ దారుణం చూసి షాక్‌కు గురైన సహోద్యోగులు, ముఖ్యంగా మహిళా సిబ్బంది, వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పలువురు మహిళా కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవోలు) నేరుగా రాష్ట్ర మెప్మా ఎండీ తేజ్‌భరత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ప్రాథమిక విచారణ అనంతరం, జిల్లా అధికారులు సదరు సీఎంఎంను పొన్నూరుకు బదిలీ చేశారు. అయితే, ఆ అధికారి ఇప్పటివరకు పొన్నూరులో విధుల్లో చేరలేదని సమాచారం. గతంలో కూడా ఆయనకు బదిలీలు జరిగినప్పటికీ, తిరిగి గుంటూరులోనే పోస్టింగ్ పొందినట్టు ఆరోపణలున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యుడైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. 
MEPMA
Guntur MEPMA
Andhra Pradesh MEPMA
Pornography
WhatsApp Group
City Mission Manager
Tej Bharath
Ponnuru
Sexual Harassment
Women Staff

More Telugu News