టీటీడీ ఉద్యోగితో ఎమ్మెల్యే వాగ్వాదం.. అస‌లేం జ‌రిగిందంటే..!

  • టీటీడీ ఉద్యోగితో వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కే రామ‌కృష్ణ వాగ్వాదం
  • నిన్న ఉద‌యం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి మూల‌మూర్తిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే
  • బ‌య‌ట‌కు వ‌స్తూ మ‌హ‌ద్వారం ముందు ఉన్న గేటు తీయాల‌ని ఉద్యోగిని అడిగిన వైనం
  • ఉద్యోగి గేటు తీయ‌డానికి నిరాక‌రించడంతో ఎమ్మెల్యే ఆగ్ర‌హం  
వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కే రామ‌కృష్ణ టీటీడీ ఉద్యోగితో వాగ్వాదానికి దిగారు. గురువారం ఉద‌యం స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఎమ్మెల్యే.. వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి మూల‌మూర్తిని ద‌ర్శించుకున్నారు. అయితే, ఆల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో మ‌హ‌ద్వారం ఎదురుగా ఉన్న గేటు తీయాల‌ని అక్క‌డ ప‌నిచేస్తున్న ఉద్యోగిని అడిగారు. 

అయితే, స‌ద‌రు ఉద్యోగి గేటు తీయ‌డానికి నిరాక‌రించారు. ఇటుగా ఎవ‌రినీ అనుమ‌తించ‌కూడ‌ద‌ని ఉన్న‌తాధికారుల ఆదేశాలు ఉన్నాయ‌ని, అంద‌రూ వెళ్లే మార్గంలోనే వెళ్లాల‌ని ఎమ్మెల్యేతో ఉద్యోగి చెప్పారు. దాంతో ఎమ్మెల్యే రామ‌కృష్ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఉద్యోగితో వాగ్వాదానికి దిగారు. ఇంత‌లో సెక్యూరిటీ సిబ్బంది స‌ర్దిచెప్ప‌డంతో ఉద్యోగి గేటు తీశారు. కాగా, విష‌యం ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లాన‌ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 


More Telugu News