Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దిన‌కూలీకి దొరికిన 8 వ‌జ్రాలు.. వాటి విలువ ఎంతంటే..!

Daily Wage Worker Finds 8 Diamonds in Madhya Pradesh
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నాలో ఓ దిన‌కూలీ త‌లుపుత‌ట్టిన అదృష్టం
  • తాను ప‌నిచేసే నిసార్ గ‌నిలో ఒకేసారి 8 వ‌జ్రాలు దొరికిన వైనం
  • ప‌న్నాలోని నిసార్ గ‌నిలో ఐదేళ్లుగా ప‌నిచేస్తున్న హ‌ర్‌గోవింద్‌, ప‌వ‌న్ దేవి 
  • దంప‌తుల‌కు దొరికిన వ‌జ్రాల విలువ సుమారు రూ. 12ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నాలో ఓ దిన‌కూలీకి అదృష్టం త‌లుపుత‌ట్టింది. అత‌నికి తాను ప‌నిచేసే నిసార్ గ‌నిలో ఒక‌టికాదు రెండుకాదు ఏకంగా 8 వ‌జ్రాలు దొరికాయి. వాటి ధ‌ర సుమారు రూ. 12ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారుల అంచనా. పూర్తి వివ‌రాల్లోకి వెళితే... ఛ‌త‌ర్‌పూర్ జిల్లాలోని క‌టియా గ్రామానికి చెందిన హ‌ర్‌గోవింద్‌, ప‌వ‌న్ దేవి దంప‌తులు గ‌త ఐదేళ్లుగా ప‌న్నాలోని నిసార్ గ‌నిలో ప‌నిచేస్తున్నారు. 

వీరికి గ‌నిలో ఒకేసారి 8 వ‌జ్రాలు దొరికాయి. వాటి విలువ‌ను నిపుణులు నిర్ధారించాక‌, వేలంలో వ‌చ్చిన మొత్తం నుంచి ప‌న్నులు పోగా మిగ‌తా డ‌బ్బును గోవింద్ ఫ్యామిలీకి అంద‌జేస్తారు. హ‌ర్‌గోవింద్ మాట్లాడుతూ... "భ‌గ‌వంతుడు ఈసారి మ‌మ్మ‌ల్ని క‌నిక‌రించాడు. గ‌తంలోనూ ఓ వ‌జ్రం దొరికింది. అప్పుడు తెలియ‌క కేవ‌లం రూ. ల‌క్ష మాత్ర‌మే నా చేతికి వ‌చ్చింది" అని అన్నాడు.   


Madhya Pradesh
Panna diamond
diamond mine
Nisar mine
daily wage worker
Hargovind
diamond auction
Katya village
Chhatarpur district
Pawan Devi

More Telugu News