Revanth Reddy: సోనియా గాంధీ రాసిన లేఖ నాకు ఆస్కార్ లాంటిది: రేవంత్ రెడ్డి

Revanth Reddy calls Sonia Gandhis letter an Oscar award
  • కులగణనను తెలంగాణ మోడల్ అని కాకుండా రేర్ మోడల్ అనవచ్చన్న సీఎం
  • రాహుల్ గాంధీ ఆత్మతో నా ఆత్మ కలిసినందునే ముఖ్యమంత్రిని అయ్యానని వ్యాఖ్య
  • కులగణన విషయంలో తెలంగాణ మోడల్ గురించి దేశమంతా చర్చ సాగుతోందన్న ముఖ్యమంత్రి
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తనను మెచ్చుకుంటూ లేఖ రాశారని, ఇది తనకు ఆస్కార్, నోబెల్ బహుమతి వంటిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కులగణనను తెలంగాణ మోడల్ అని కాకుండా రేర్ మోడల్ అని కూడా అనవచ్చని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ కులగణన చేయలేదని, అందుకే రేర్ మోడల్ అనవచ్చని అభిప్రాయపడ్డారు.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పనులు చేసినప్పటికీ, సోనియా గాంధీ రాసిన లేఖనే తనకు గొప్ప అని వ్యాఖ్యానించారు. మీది కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ముఖ్యమంత్రి ఎలా అయ్యారని అందరూ అడుగుతున్నారని, అయితే రాహుల్ గాంధీ ఆత్మతో తన ఆత్మ కలిసిందని ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ మనసులో అనుకున్న పనులను తాను చేయాలని సంకల్పించానని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన అనుకున్నవన్నీ తాను చేశానని, అందుకే ఇప్పుడు కులగణన విషయంలో తెలంగాణ మోడల్ గురించి దేశమంతా చర్చ జరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. రాహుల్ గాంధీ ఏమైనా చెప్పారంటే అది తనకు బంగారు గీత అని స్పష్టం చేశారు.
Revanth Reddy
Sonia Gandhi
Telangana
Kulaganana
Caste Census
Rahul Gandhi
AICC

More Telugu News