Andhra Pradesh Metro: ఏపీలో రెండు మెట్రో ప్రాజెక్టులకు కీలక ముందడుగు

Andhra Pradesh Metro Projects Take a Key Step Forward
  • విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు
  • టెండర్లు పిలవాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ భాగస్వామ్యంతో ప్రాజెక్టు
ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. ఈ దిశగా నేడు కీలక ముందుడుగు పడింది. ఈ రెండు ముఖ్య నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు పిలిచేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. 

మొత్తం రూ.21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.10,118 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. మొదట ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.
Andhra Pradesh Metro
Visakhapatnam Metro
Vijayawada Metro
AP Metro Project
Metro Rail Project
Chandrababu Naidu
Andhra Pradesh government
Visakhapatnam
Vijayawada
AP News

More Telugu News